మ్యాజిక్ చేసిన ‘లవ్ స్టోరి’ టీజర్.. క్లాసికల్ హిట్!

45

దిశ, వెబ్‌డెస్క్: శేఖర్ కమ్ముల మ్యాజిక్.. నాగ చైతన్య ఇన్నోసెన్స్.. సాయి పల్లవి యాక్టింగ్.. మెలోడి బీజీఎం.. అన్నీ కలిసి ‘లవ్ స్టోరి’ సినిమా టాలీవుడ్‌లో క్లాసికల్ హిట్‌గా నిలిచిపోవడం ఖాయం అనిపిస్తుంది. ‘లైఫ్‌లో తమకు నచ్చిన విధంగా సెటిల్ అయిపోవాలనుకునే రేవంత్, మౌనిక.. ఒక చోటుకి చేరడం.. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో పారిపోవడం..’ టీజర్‌ను చూస్తే ‘లవ్ స్టోరి’ కథ ఇదే అని అర్థం అవుతుండగా.. చై యాక్టింగ్ మరో లెవల్‌కు రీచ్ అయింది. ఇన్నాళ్లు చై సినిమాలు ఒక ఎత్తయితే.. ఈ సినిమాలో తన నటన మరో ఎత్తు. టీజర్‌లో ఎప్పటిలాగే సాయి పల్లవి తెలంగాణ పోరిగా అదరగొట్టేయగా.. ‘ ఏందిరా వదిలేస్తావారా నన్ను’ అన్న మలార్ బ్యూటీ డైలాగ్‌కు చైతు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌కు ప్రేక్షకులు పడిపోయారు అంతే. స్మాల్ ఎక్స్‌ప్రెషన్స్‌లోనే హెవీ ఎమోషన్స్ క్యారీ చేసి బెస్ట్ అనిపించుకున్నాడు. ఇక అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ అయితే నాగేశ్వర రావుకు ‘దేవదాసు’ ఎలాగో.. నాగార్జునకు ‘గీతాంజలి’ ఎలాగో.. ఇప్పుడు నాగచైతన్యకి ‘లవ్ స్టోరి’ అలాంటిదని.. ప్రేమ కథల్లో జీవించడంలో అక్కినేని ఫ్యామిలీకి సాటిరారంటూ మురిసిపోతున్నారు.