- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అడ్డొచ్చిన కులం.. నవీన్, ఆయేషా ఆత్మహత్య
<p>దిశ, ఏపీ బ్యూరో : ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసిబతకాలనుకున్నారు. వివాహ బంధంతో తమ ప్రేమను పండించుకోవాలనుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. కులాలు వేరు కావడంతో ప్రేమ వివాహానికి ఒప్పుకునేది లేదని ఇరుకుటుంబాలు తేల్చి చెప్పాయి. దీంతో కలిసి జీవించలేనప్పుడు.. కలిసి చనిపోవడమే మంచిదని భావించిన ఆ ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఆత్మకూరు టెక్కేవీధికి చెందిన సోమా నవీన్ (20), […]</p>

దిశ, ఏపీ బ్యూరో : ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసిబతకాలనుకున్నారు. వివాహ బంధంతో తమ ప్రేమను పండించుకోవాలనుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. కులాలు వేరు కావడంతో ప్రేమ వివాహానికి ఒప్పుకునేది లేదని ఇరుకుటుంబాలు తేల్చి చెప్పాయి. దీంతో కలిసి జీవించలేనప్పుడు.. కలిసి చనిపోవడమే మంచిదని భావించిన ఆ ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల ప్రకారం.. ఆత్మకూరు టెక్కేవీధికి చెందిన సోమా నవీన్ (20), ఆయేషా (18) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. ఎంత ప్రయత్నించినప్పటికీ పెద్దల మనసులు మారకపోవడంతో చనిపోవాలని నిర్ణయించుకున్నారు. పొలాల్లో విషగుళికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రేమజంటను గమనించిన స్థానికులు వెంటనే ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.






