‘బ్యూటి’ఫుల్ బెనిఫిట్స్.. అతివల అందానికి వన్నె తెస్తున్న నేచురల్ ప్రొడక్ట్స్

by Vadlamudi Anukaran |

<p>దిశ, ఫీచర్స్ : లైఫ్‌లో లగ్జరీస్ అనుభవించేందుకు కెరియర్‌లో ఎంతలా కష్టపడతామో.. అందమైన రూపం కోసం అంతలా కాకపోయినా కొంతైనా ఆరాట పడుతుంటాం. ఇదే క్రమంలో ప్రముఖ బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీలు టీవీలు, హోర్డింగ్స్‌లో గుప్పించే ప్రకటనలకు ఆకర్షితులై వేలరూపాయల డబ్బును వెచ్చిస్తుంటాం. కొందరి చర్మ స్వభావానికి సదరు కంపెనీల ఉత్పత్తులు సూట్ అయితే, కొంత మేర పాజిటివ్ రిజల్ట్స్ పొందే అవకాశం ఉండగా.. చాలా వరకు బ్యూటీ ఉత్పత్తులు ఏ మాత్రం ప్రభావం చూపవన్నది చేదు [&hellip;]</p>

‘బ్యూటి’ఫుల్ బెనిఫిట్స్.. అతివల అందానికి వన్నె తెస్తున్న నేచురల్ ప్రొడక్ట్స్
X

దిశ, ఫీచర్స్ : లైఫ్‌లో లగ్జరీస్ అనుభవించేందుకు కెరియర్‌లో ఎంతలా కష్టపడతామో.. అందమైన రూపం కోసం అంతలా కాకపోయినా కొంతైనా ఆరాట పడుతుంటాం. ఇదే క్రమంలో ప్రముఖ బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీలు టీవీలు, హోర్డింగ్స్‌లో గుప్పించే ప్రకటనలకు ఆకర్షితులై వేలరూపాయల డబ్బును వెచ్చిస్తుంటాం.

కొందరి చర్మ స్వభావానికి సదరు కంపెనీల ఉత్పత్తులు సూట్ అయితే, కొంత మేర పాజిటివ్ రిజల్ట్స్ పొందే అవకాశం ఉండగా.. చాలా వరకు బ్యూటీ ఉత్పత్తులు ఏ మాత్రం ప్రభావం చూపవన్నది చేదు నిజం. పైగా దీర్ఘకాలికంగా వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్‌తో పాటు ప్రాణాంతక క్యాన్సర్ ముప్పును ఎదుర్కోక తప్పదనేది నిపుణుల మాట. తన స్నేహితురాలి విషయంలో ఇలాంటి అనుభవాన్నే చవిచూసిన ఓ యువతి.. ‘ఎన్స్ క్లోజెట్’ పేరుతో సొంత బ్రాండ్‌ను ప్రారంభించి నేచురల్, వెగాన్, కెమికల్ ఫ్రీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌ను అందిస్తూ ప్రముఖ కెమికల్ బేస్డ్ బ్యూటీ బ్రాండ్స్‌కు పోటీనిస్తోంది. సహజసిద్ధ సౌందర్య ఉత్పత్తులపై అతివలకు అవగాహన కల్పిస్తూ బిజినెస్‌లో దూసుకుపోతోంది..

ఢిల్లీకి చెందిన నందిత మంచంద యూఎస్‌లో డిగ్రీ కంప్లీట్ చేసింది. ఈ క్రమంలోనే 21 ఏళ్లకే స్కిన్ క్యాన్సర్‌ బాధపడుతున్న తన ఫ్రెండ్‌ను థెరపీస్, ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లినపుడు డెర్మటాలజిస్ట్ చెప్పిన విషయాలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆ యువతి వాడుతున్న బ్యూటీ ప్రొడక్ట్సే తను స్కిన్ క్యాన్సర్‌కు కారణమని వెల్లడించిన డాక్టర్.. అలాంటి ఉత్పత్తులు వాడేటపుడు వాటిపై ఉండే లేబుల్స్‌ను జాగ్రత్తగా చదవాలని, ఏవైనా రసాయన అవశేషాలు చర్మంపై ఉండిపోతాయో తెలుసుకోవాలని చెప్పడం నందితను ఆలోచనలో పడేశాయి.

2010లో ఇండియాకు తిరిగొచ్చాక, సొంతంగా సెలూన్ ఓపెన్ చేసిన నందిత.. కస్టమర్లు వాడుతున్న ఫేస్ బ్లీచ్‌లు, హెయిర్ ప్రొడక్ట్స్‌లో కెమికల్స్ ఉన్నట్టు గుర్తించి తనే కొత్తగా నేచురల్ ప్రొడక్ట్స్ లాంచ్ చేయాలనుకుంది. ఈ అడుగే తనను పూర్తిస్థాయిలో నేచురల్ బ్యూటీ బిజినెస్‌ ప్రారంభించే ఆలోచనకు బీజం వేసింది. ఈ క్రమంలో 2018లో వెగాన్, నేచురల్, హ్యాండ్ మేడ్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్‌తో ‘ఎన్స్ క్లోజెట్’ ప్రారంభించబడింది. కాగా ఇవన్నీ ఎస్‌ఎల్‌ఎస్(సోడియం లారిల్ సల్ఫేట్), పారాబీన్ ఫ్రీ, కెమికల్ ఫ్రీనే కాకుండా ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే ఉత్పత్తులే.

బ్యూటీ ప్రొడక్ట్స్‌పై అవగాహన తప్పనిసరి..

ఊహ తెలిసినప్పటి నుంచి అందానికి ప్రాధాన్యత ఇచ్చేదాన్నని తెలిపిన నందిత.. ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ తర్వాత టేబుల్‌పై వదిలేసిన బనానా, కాఫీ, లెమన్ లేదా గోధుమ పిండిని ఫేస్ లేదా హెయిర్‌కు అప్లయ్ చేసుకునేవాళ్లమని చెప్పింది. సంవత్సరాలుగా పాటిస్తున్న ఈ రెమెడీస్‌ను తన బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఇన్‌కార్పొరేట్ చేయాలనుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఎలాంటి కెమికల్స్ లేనటువంటి నేచురల్ లిప్‌స్టిక్స్‌తో మొదలుపెట్టి.. ప్రస్తుతం స్కిన్, హెయిర్, లిప్స్, కళ్ల అందం కోసం 60కి పైగా సౌందర్య ఉత్పత్తులను ఎన్స్ బ్రాండ్‌ ద్వారా అందిస్తున్నారు. మాయిశ్చరైజర్‌‌లో హైలురోనిక్ యాసిడ్, కెరటిన్, సిల్క్ ప్రొటీన్, కొబ్బరి పాలు, అవిసె గింజలు, ఉసిరి, రీటా వంటి అందరికీ తెలిసిన పదార్థాలనే వాడుతున్నారు. అంతేకాదు ఈ కంపెనీకి చెందిన ఉత్పత్తుల్లో ఉపయోగించే పండ్లు, బటర్, కూరగాయలు, పువ్వుల కోసం నేరుగా రైతులతో ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం.

కంపెనీ ఉత్పత్తులు..

ఎన్స్ క్లోజెట్ కంపెనీ ఈ మధ్యే బ్లూ టాన్సీ ఆయిల్‌తో స్లీపింగ్ మాస్క్ లాంచ్ చేసింది. ఇది చర్మంపై మంట, దురద వంటి లక్షణాలను తగ్గిస్తుంది. అంతేకాదు కంపెనీకి సంబంధించిన ఉత్పత్తుల్లో విటమిన్ ‘సీ, ఏ’ యాడ్ చేస్తుంటారు. ఇక ఈ బ్రాండ్ నుంచి రిలీజైన భీమ్‌రాజ్ ఆయిల్ చాలా సమర్థవంతమైన ఫలితాలను ఇస్తోంది. ప్రస్తుత రోజుల్లో హైలురోనిక్ ఆయిల్‌ వినియోగం పెరుగుతుండగా, దీన్ని ఉత్తమ మాయిశ్చరైజర్‌తో కలిపి వాడాల్సిన అవసరముందని తెలిపిన నందిత.. కళ్ల ఆరోగ్యానికి కాపర్ పెప్టైడ్‌తో పాటు పొటాటో స్టార్చ్‌, అరటిపండు తొక్కలు బాగా పనిచేస్తాయని చెప్పింది. రసాయన ఉత్పత్తులు వేగవంతమైన ఫలితాలను ఇచ్చినప్పటికీ దీర్ఘకాలికంగా తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ బయటపడే అవకాశం ఉంది. అదే నేచురల్ ప్రొడక్ట్స్ విషయానికొస్తే.. రిజల్ట్స్ స్లోగా ఉన్పప్పటికీ చర్మానికి ఎలాంటి హాని చేయవని చెప్పుకొచ్చింది. ఈ విషయాలపై కస్టమర్లు అవగాహన కలిగి ఉండాలని సూచించింది.

ప్యాకింగ్ అండ్ మార్కెటింగ్..

తమ ఉత్పత్తులు పర్యావరణానికి మేలు చేసేలా ఉండాలని భావించి.. గ్లాస్ జార్స్, పేపర్, బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్‌లోనే ప్యాకింగ్ చేస్తున్నారు. అంతేకాదు 70 శాతం వరకు తమ పనిని మాన్యువల్‌గానే నిర్వహిస్తూ ఎలక్ట్రిసిటీని ఆదాచేస్తూ, ఉపాధి అవకాశాలను పెంచుతున్నారు. ఈ క్రమంలో వెబ్‌సైట్ రన్ చేస్తు్న్న ఎన్స్.. నైకా, అమెజాన్ వంటి సంస్థలతో టైఅప్ అయి నెలకు 2000 వరకు ఆర్డర్స్ అందుకుంటోంది.

ఇండియన్ బ్రాండ్స్‌పై నమ్మకముంచాలి..

నేను యూఎస్ నుంచి ఇండియాకు తిరిగొచ్చినప్పుడు ఇక్కడ స్నాప్‌డీల్ తప్ప ఇతర ఈకామర్స్ ప్లాట్‌ఫామ్స్ లేవు. 27 సంవ్సతరాల యంగ్ ఏజ్‌లోనే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయడాన్ని వెండర్స్ అడ్వాంటేజ్‌గా తీసుకొని అధిక ధరలు కోట్ చేసేవారు. కానీ ఇప్పుడు వారితో నెగోషియేట్ చేయగలుగుతున్నా. ప్రస్తుతం పాండమిక్ కారణంగా ఉత్పత్తుల్లో ఎక్కువ ప్రయోగాలు చేయలేకపోతున్నాం. కస్టమర్లు ఫారిన్ బ్రాండ్ల మాయ నుంచి బయటపడి ఇండియన్ బ్రాండ్స్‌పై నమ్మకం పెంచుకుంటే పాజిటివ్ రిజల్ట్స్ అందుకునే అవకాశం ఉంది. ఒక్కొక్కరి పర్స్‌పెక్టివ్‌లో అందానికి సంబంధించి అభిప్రాయాలు వేరేలా ఉన్నా.. బ్యూటీ అనేది మిమ్మల్ని నిర్వచించేలా ఉండకూదనేది నా అభిప్రాయం. అంతర్గత బలం, మెంటల్ హెల్త్‌తో పాటు అప్పియరెన్స్ పట్ల మీరు ఎంత కంఫర్ట్‌గా ఉన్నారన్నదే మ్యాటర్.
– నందిత మంచందా, ఎన్స్ క్లోజెట్ ఫౌండర్

ఒంటరిగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న మహిళలు ఎవరైనా ధైర్యంగా చేయాలి. ఈ క్రమంలో చాలామంది వెనక్కి లాగేందుకు ప్రయత్నిస్తుంటారు. అయినా మొండిగా ముందుకు సాగాలే తప్ప, ఇతరులపై ఆధారపడితే మీరేం తెలుసుకోలేరంటున్న నందిత.. అప్‌కమింగ్ బిజినెస్‌ ఉమెన్‌కు స్ఫూర్తిగా నిలుస్తోంది.

Next Story