అతని కోసం బ్రేక్ కొడితే.. భార్య పై నుంచి లారీ వెళ్లింది

by Batti.Sumithra |

<p>దిశ, భువనగిరి: యాదాద్రి- భువనగిరి జిల్లా కేంద్రంలోని జగదేవ్ పూర్ చౌరస్తా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలోఒకరు మృతి చెందిన ఘటన స్థానికులను కలిచివేసింది. వివారాల్లోకి వెళితే.. తుర్క పల్లి మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన బద్దం మల్లారెడ్డి, ఆయన భార్య రమణమ్మ.. వీరద్దరూ కలిసి స్వగ్రామం నుంచి భువనగిరిలో ఉన్న తన బిడ్డను చూడాలని ఆదివారం బయలు దేరారు. కూతురింటికి కాసేపట్లో వారు చేరుకోనున్నారు. అయితే భువనగిరిలోని జగదేవ్ పూర్ చౌరస్తా వద్ద ఓ [&hellip;]</p>

అతని కోసం బ్రేక్ కొడితే.. భార్య పై నుంచి లారీ వెళ్లింది
X

దిశ, భువనగిరి: యాదాద్రి- భువనగిరి జిల్లా కేంద్రంలోని జగదేవ్ పూర్ చౌరస్తా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలోఒకరు మృతి చెందిన ఘటన స్థానికులను కలిచివేసింది. వివారాల్లోకి వెళితే.. తుర్క పల్లి మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన బద్దం మల్లారెడ్డి, ఆయన భార్య రమణమ్మ.. వీరద్దరూ కలిసి స్వగ్రామం నుంచి భువనగిరిలో ఉన్న తన బిడ్డను చూడాలని ఆదివారం బయలు దేరారు. కూతురింటికి కాసేపట్లో వారు చేరుకోనున్నారు. అయితే భువనగిరిలోని జగదేవ్ పూర్ చౌరస్తా వద్ద ఓ తమ స్కూటీకి ఎదురుగా ఓ వ్యక్తి వచ్చాడు. ఇది గమనించి మల్లారెడ్డి బ్రేక్ వేశాడు. దీంతో రమణమ్మ కిందపడిపోయింది. అప్పుడే వెనక నుండి వచ్చిన హర్యానాకు చెందిన లారీ ఆమె మీద గుండా వెళ్లింది. దీనిని గమనించిన స్థానికులు లారీని అడ్డగించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Next Story