- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా లక్షణాలతో లారీ డ్రైవర్ మృతి?
<p>దిశ, ఆదిలాబాద్: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని డొల్లరా అనే గ్రామ సమీపంలో ఓ లారీ డ్రైవర్ మృతి కలకలం రేపింది. కరోనా లక్షణాలతోనే ఆయన మృతిచెందినట్టు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి నెల్లూరు జిల్లాకు చెందిన లారీ డ్రైవర్‌గా గుర్తించారు. ఆయనతోపాటు లారీ వెంట వెళ్లిన క్లీనర్‌కు కూడా కరోనా సోకిందనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అయితే ఆదిలాబాద్ జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎవరూ ఘటన స్థలానికి రాలేదని గ్రామస్తులు అంటున్నారు. ఘటనాస్థలానికి జైనాథ్ […]</p>
దిశ, ఆదిలాబాద్: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని డొల్లరా అనే గ్రామ సమీపంలో ఓ లారీ డ్రైవర్ మృతి కలకలం రేపింది. కరోనా లక్షణాలతోనే ఆయన మృతిచెందినట్టు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి నెల్లూరు జిల్లాకు చెందిన లారీ డ్రైవర్‌గా గుర్తించారు. ఆయనతోపాటు లారీ వెంట వెళ్లిన క్లీనర్‌కు కూడా కరోనా సోకిందనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అయితే ఆదిలాబాద్ జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎవరూ ఘటన స్థలానికి రాలేదని గ్రామస్తులు అంటున్నారు. ఘటనాస్థలానికి జైనాథ్ మండల పోలీసులు వచ్చి విచారిస్తున్నారు.
Next Story






