- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లారీ, బైక్ ఢీ : ఇద్దరు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. విజయనగరం గంగడాబలజపేట, కురకుల వీధికి చెందిన సింహాచలం(29), ఈశ్వరరావు(22) అనే ఇద్దరు అన్నదమ్ములు… విజయనగరం నుంచి హైదరాబాద్ బైక్ పై బయలుదేరారు. పొట్టిపాడు వద్దకు రాగానే వారి బైక్ ను లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అత్కూరు పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది, స్ధానిక గ్రామస్తుల సాయంతో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. విజయనగరం గంగడాబలజపేట, కురకుల వీధికి చెందిన సింహాచలం(29), ఈశ్వరరావు(22) అనే ఇద్దరు అన్నదమ్ములు… విజయనగరం నుంచి హైదరాబాద్ బైక్ పై బయలుదేరారు.
పొట్టిపాడు వద్దకు రాగానే వారి బైక్ ను లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అత్కూరు పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది, స్ధానిక గ్రామస్తుల సాయంతో హైవే అంబులెన్స్ ద్వారా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో ఒకరు మృతి చెందగా… మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసినట్లు అత్కూరు ఎస్ఐ జీ.శ్రీనివాసరావు తెలిపారు.
Next Story






