- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్.. శివుడి విగ్రహానికి ఘోర అవమానం.. భగ్గుమంటున్న స్థానికులు (వీడియో)
<p>దిశ, ముధోల్ : ముధోల్ నియోజకవర్గంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భైంసా పట్టణంలోని గోపాల్ నగర్ శ్మశాన వాటిక ప్రాంగణంలోని శివుని విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, భైంసా పట్టణంలో ఇదివరకే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైన ఘటన ఛేదించిన పోలీసులకి.. ఇలా మరో ఘటన తలనొప్పిగా మారింది. దీంతో పోలీసులు నిందితులను వెతికే […]</p>

X
దిశ, ముధోల్ : ముధోల్ నియోజకవర్గంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భైంసా పట్టణంలోని గోపాల్ నగర్ శ్మశాన వాటిక ప్రాంగణంలోని శివుని విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, భైంసా పట్టణంలో ఇదివరకే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైన ఘటన ఛేదించిన పోలీసులకి.. ఇలా మరో ఘటన తలనొప్పిగా మారింది. దీంతో పోలీసులు నిందితులను వెతికే పనిలో పడ్డారు. ఘటనా స్థలానికి పట్టణ ఏఎస్పీ కిరణ్ కారే, నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ చేరుకొని పరిశీలించారు. నిందితుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు.
Next Story






