- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విమాన రాకపోకలపై ఆంక్షల సడలింపు
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: భారత్, యూకేల మధ్య విమాన రాకపోకలపై ఈ నెల 8వ తేదీ నుంచి ఆంక్షలు సడలనున్నాయి. ఉభయ దేశాలకు చెందిన ఒక్కో విమానయాన సంస్థ వారానికి కేవలం 15 విమానాలను మాత్రమే నడపాల్సి ఉంటుంది. 23వ తేదీ వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. ఆ విమానాలు కూడా ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌ల నుంచి మాత్రమే నడుస్తాయని తెలిపారు. యూకేలో కొత్త రకం […]</p>

X
న్యూఢిల్లీ: భారత్, యూకేల మధ్య విమాన రాకపోకలపై ఈ నెల 8వ తేదీ నుంచి ఆంక్షలు సడలనున్నాయి. ఉభయ దేశాలకు చెందిన ఒక్కో విమానయాన సంస్థ వారానికి కేవలం 15 విమానాలను మాత్రమే నడపాల్సి ఉంటుంది. 23వ తేదీ వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. ఆ విమానాలు కూడా ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌ల నుంచి మాత్రమే నడుస్తాయని తెలిపారు. యూకేలో కొత్త రకం కరోనా రిపోర్ట్ కావడంతో ఆ దేశం నుంచి గతనెల 23 నుంచి విమానరాకపోకలపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 7వ తేదీ వరకు నిషేధం అమలవనుంది. అనంతరం దశలవారీగా ఆంక్షలను సడలించడానికి కేంద్రం నిర్ణయించింది.
Next Story






