చీరలో అందంగా ఉన్నావ్.. నలుగురితో రేప్ చేయిస్తా!

by  |
చీరలో అందంగా ఉన్నావ్.. నలుగురితో రేప్ చేయిస్తా!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉన్నత చదువు చదివినా వక్రబుద్ధి మారలేదతనికి. చేసేది సాఫ్ట్ వేర్ ఉద్యోగం అయినా మనసునిండా నీచపు బుద్దులే. తల్లిదండ్రులు లేని ఓ యువతిపై కన్నేసిన అతగాడు దూరపు చుట్టరికం పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. యువతి ఎదురు తిరగడంతో నలుగురిని పెట్టి అత్యాచారం చేయిస్తానని బెదిరింపులకు దిగాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగింది.

సూర్యాపేట పట్టణంలోని మామిళ్లగడ్డకు చెందిన యువతికి తల్లిదండ్రులు లేరు. ఆమె హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం వర్క్ ఫ్రం హోమ్ లో ఉండి ఉద్యోగం చేస్తోంది. అయితే ఆమె మనసు ప్రశాంతత కోసం స్థానిక చర్చ్ కి వెళ్లి ప్రార్ధనలు చేసుకునేది. ఈ క్రమంలో ఆ యువతిపై రేవంత్ ఇజ్రాయెల్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి కన్ను పడింది. ఒంటరిగా ఉంటున్న యువతి కావడంతో సులభంగా లొంగదీసుకోవచ్చని భావించాడు. ఆమెను లొంగదీసుకునే దురుద్దేశంతో ఆమె ఫేస్ బుక్ ఖాతాను తెలుసుకుని ఆమెతో తాను దగ్గరి బంధువునంటూ చాటింగ్ చేయడం మొదలు పెట్టాడు.

మొదట బంధువేనని నమ్మిన యువతి.. అతడి మెసేజ్ లకు రిప్లై ఇచ్చింది. కానీ నైట్ షిఫ్ట్ డ్యూటీ చేసే సమయంలో మెసేంజర్ కాల్స్ చేసి తాను బావ వరుస అవుతానని , చీర కట్టులో చాలా అందంగా ఉన్నావని, బావ అని పిలవాలని వేధించడం మొదలు పెట్టాడు. అలా పిలవడం ఏంటని తన నుండి ఏం ఆశిస్తున్నావని ప్రశ్నించింది. మర్యాదగా మాట్లాడాలని లేకుంటే చెప్పుతో బుద్ధి చెప్పాల్సి వస్తుందని ఆ యువతి హెచ్చరించింది. దీంతో రేవంత్ బూతు పురాణం మొదలు పెట్టి.. చెప్పిన మాట వినకుంటే ఒంటరి దానివి.. నలుగురిని పెట్టి రేప్ చేయిస్తానని బెదిరించాడు. బయటకు వెళ్లినప్పుడు తన కారుని అడ్డుపెట్టి వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో సదరు యువతి సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed