ఏమాత్రం ప్రభావం చూపని బీఆర్ఎస్.. కంచుకోటలోనూ ఓటమి దిశగా..!

by Gantepaka Srikanth |

లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ వెనుకబడింది. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే హోరాహోరీ పోటీ నెలకొంది. 17 లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేసింది.

ఏమాత్రం ప్రభావం చూపని బీఆర్ఎస్.. కంచుకోటలోనూ ఓటమి దిశగా..!
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ వెనుకబడింది. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే హోరాహోరీ పోటీ నెలకొంది. 17 లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేసింది. మెజార్టీ సీట్లలో విజయం సాధిస్తామని పార్టీ అధిష్టానం ధీమా వ్యక్తం చేసింది. కానీ ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి బీఆర్ఎస్ ఏ రౌండ్లలోనూ ఆధిక్యం కనబర్చలేకపోయింది. మెదక్ పార్లమెంట్ స్థానంలోనూ వెనకబడిపోయింది. అక్కడ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ 8 స్థానాలు, బీజేపీ 8 స్థానాల్లో లీడ్‌లో ఉండగా.. ఎమ్ఐఎమ్ పార్టీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఫిక్స్ అయిన బీఆర్ఎస్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.

Next Story