- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నీ రాసుకుంటున్నాం.. వడ్డీతో సహా చెల్లిస్తాం: లోకేశ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: అనంతపురంలో సోమవారం జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ పరామర్శించారు. కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జేసీ ప్రభాకర్ పై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్థిక నేరస్థుడు కాదని, జేసీ బ్రదర్స్ కు ట్రావెల్స్ వ్యాపారం కొత్త కాదని, దొంగ కేసులు పెడితే భయపడేదిలేదన్నారు. ఇలాంటి రాజకీయాలు తమిళనాడులో ఉండేవని.. ప్రస్తుతం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురంలో సోమవారం జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ పరామర్శించారు. కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జేసీ ప్రభాకర్ పై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్థిక నేరస్థుడు కాదని, జేసీ బ్రదర్స్ కు ట్రావెల్స్ వ్యాపారం కొత్త కాదని, దొంగ కేసులు పెడితే భయపడేదిలేదన్నారు. ఇలాంటి రాజకీయాలు తమిళనాడులో ఉండేవని.. ప్రస్తుతం మన రాష్ట్రంలో చూస్తున్నామంటూ మండిపడ్డారు. అన్నీ రాసుకుంటున్నాం.. వడ్డీతో సహా వాటిని చెల్లిస్తామన్నారు. మా నాయకులపై దాడి చేస్తే ఊరుకునేదేలేదన్నారు. తొందర్లోనే తిరగబడే పరిస్థితులు వస్తాయంటూ లోకేశ్ మండిపడ్డారు.
Next Story






