- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో లాక్‌డౌన్.. ఎక్కడో తెలుసా.?
by Shyam |
<p>దిశ, ముధోల్ : తెలంగాణలో కరోనా విజృంభన కొనసాగుతోంది. వైరస్ కట్టడికి కొన్ని ప్రాంతాల్లో తమకు తాముగా కొన్ని గ్రామాలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పెట్టుకుంటున్నాయి. తాజాగా ముధోల్ నియోజకవర్గం బైంసా మండలంలోని మహాగం గ్రామ ప్రజలు.. తాము లాక్‌డౌన్ విధించుకుంటున్నామని తెలిపారు. గ్రామంలో ఇప్పటి వరకు 20 మందికి పాజిటివ్ రావడంతో, రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో సర్పంచ్ అప్పల రాకేశ్, వీడీసీ కమిటీ, గ్రామస్తులు కలిసి ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో […]</p>

X
దిశ, ముధోల్ : తెలంగాణలో కరోనా విజృంభన కొనసాగుతోంది. వైరస్ కట్టడికి కొన్ని ప్రాంతాల్లో తమకు తాముగా కొన్ని గ్రామాలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పెట్టుకుంటున్నాయి. తాజాగా ముధోల్ నియోజకవర్గం బైంసా మండలంలోని మహాగం గ్రామ ప్రజలు.. తాము లాక్‌డౌన్ విధించుకుంటున్నామని తెలిపారు. గ్రామంలో ఇప్పటి వరకు 20 మందికి పాజిటివ్ రావడంతో, రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో సర్పంచ్ అప్పల రాకేశ్, వీడీసీ కమిటీ, గ్రామస్తులు కలిసి ఈరోజు సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఈరోజు నుండి బుధవారం వరకు స్వచ్చందంగా లాక్‌డౌన్ ప్రకటిస్తున్నట్టు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని సర్పంచ్ అన్నారు. గ్రామంలో స్వచ్చందంగా షాపులు మూసి వేస్తూన్నట్లు తెలిపారు. కేవలం అత్యవసర సమయాల్లో మాత్రమే ఇంటి నుండి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు.
Next Story






