శ్రీకాళహస్తిలో లాక్‌డౌన్ సడలింపు

by Vemula.Srinu Prasad |

<p>శ్రీకాళహస్తిలో సంపూర్ణ లాక్‌డౌన్ నిబంధనలను గురువారం నుంచి సడలించాలని అధికారులు నిర్ణయించారు. కంటైన్మెంట్ ప్రాంతాలను మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసరాల కోసం మినహాయించారు. పట్ణణంలోని ముత్యాలమ్మగుడి వీధి, ఇమామ్ వీధి, పీవీరోడ్డు, నగార్చిపాళెం, గోపాలవనం, కుమారస్వామి తిప్ప ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఉన్నట్లు కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ మైదానం, వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో కూరగాయల మార్కెట్లు నిర్వహించుకోవడానికి అనుమతించారు. ఉదయం 10 [&hellip;]</p>

శ్రీకాళహస్తిలో లాక్‌డౌన్ సడలింపు
X

శ్రీకాళహస్తిలో సంపూర్ణ లాక్‌డౌన్ నిబంధనలను గురువారం నుంచి సడలించాలని అధికారులు నిర్ణయించారు. కంటైన్మెంట్ ప్రాంతాలను మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసరాల కోసం మినహాయించారు. పట్ణణంలోని ముత్యాలమ్మగుడి వీధి, ఇమామ్ వీధి, పీవీరోడ్డు, నగార్చిపాళెం, గోపాలవనం, కుమారస్వామి తిప్ప ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఉన్నట్లు కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ మైదానం, వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో కూరగాయల మార్కెట్లు నిర్వహించుకోవడానికి అనుమతించారు. ఉదయం 10 గంటల నుంచి లాక్ డౌన్ నిబంధనలు కొనసాగనున్నాయి. కంటైన్మెంట్ పరిధిలోని కాలనీల్లో నిత్యావసరాలను డోర్ డెలివరీ చేయనున్నారు.

Tags: srikalahasti, lock down, rules, ap

Next Story