- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ తీర ప్రాంతాల్లో 10రోజులు లాక్‌డౌన్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: కేరళ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తీర ప్రాంతాల్లో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలోనే కరోనా కట్టడికి స్థానిక అధికారులు పలు చర్యలు చేపడుతున్నారు. తాజాగా తిరువనంతపురం తీర ప్రాంతాల్లో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఆ జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరువనంతపురం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలను మూడు క్రిటికల్ కంటైన్‌మెంట్ జోన్‌లుగా విభజించారు. ఆ మూడు జోన్లలో జూలై 18 అర్థరాత్రి నుంచి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేరళ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తీర ప్రాంతాల్లో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలోనే కరోనా కట్టడికి స్థానిక అధికారులు పలు చర్యలు చేపడుతున్నారు. తాజాగా తిరువనంతపురం తీర ప్రాంతాల్లో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఆ జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తిరువనంతపురం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలను మూడు క్రిటికల్ కంటైన్‌మెంట్ జోన్‌లుగా విభజించారు. ఆ మూడు జోన్లలో జూలై 18 అర్థరాత్రి నుంచి జూలై 28 వరకు పది రోజులపాటు కఠిన లాక్‌డౌన్ విధించినట్లు కలెక్టర్ స్పష్టంచేశారు. ఈ 10 రోజులపాటు ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ నిబంధనలు వర్తించవని, కఠిన లాక్‌డౌన్ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టంచేశారు.
Next Story






