సీఎం కీలక నిర్ణయం.. రేపటి నుండి వీకెండ్ లాక్‌డౌన్

76

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌లో కూడా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో రేపు సాయంత్రం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు వీకెండ్ లాక్‌డౌన్ విధిస్తున్నట్టు సీఎం ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా ప్రభావం ఎక్కువగా పట్టణాల్లో కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కరోనా కట్టడికి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..