నిలిచిన చక్రం.. అందని వైద్యం

by  |
నిలిచిన చక్రం.. అందని వైద్యం
X

దిశ, సూర్యాపేట: గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యా ధులతో బాధపడుతున్న వారికి ఇంటి వద్దే వైద్య సేవలు, మందులు అందించే 104 వాహన సేవలు నిలిచిపోయాయి. జిల్లాకు కేటాయించిన 8 వాహనాల్లో మరమ్మతులకు నోచుకోక కోదాడలో ఒక్క వాహనం మూలకు చేరింది. దీంతో వ్యాధిగ్రస్తులు వైద్యం కోసం మండల కేంద్రాలకు రావాల్సి వస్తోంది. ప్రైవేటును ఆశ్రయించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామా ల్లోని పేదలకు అవసరమైన వైద్య సేవలు అందించాలనే 104 వాహనాల లక్ష్యం నీరుగారుతోంది. మరమ్మతులకు నోచుకోక ఆస్పత్రుల వద్దే పడి ఉన్నది. రోజులు తరబడి కదలకపోవడంతో టైర్లు దెబ్బతింటున్నాయి. జిల్లాలోని సూర్యాపేట, కోదాడ డివిజన్లలో మొత్తం 8 వాహనాలను ఏర్పాటు చేశారు. వాహనంలో పైలెట్‌ (చోదకుడు), ఫార్మాసిస్టు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉంటారు. ఆదివారం, సెలవు దినాలు మినహా మిగతా రోజులు నిత్యం వాటికి కేటాయించిన గ్రామాల్లో తిరిగి వైద్య సేవలు అందించాలి. అవసరమున్న వారికి ఉచితంగా మందులు ఇవ్వాలి. ఆయా మండలాల పరిధి లో ఏ రోజు ఏ గ్రామానికి వెళ్లాలన్నది నెల రోజుల ప్రణాళిక ముందే ఖరారు చేస్తారు. దాని ప్రకారం వాహనాలు వెళ్లి వైద్య శిబిరాలు నిర్వహించాలి.

సేవలు ఇలా..

వయసు పైబడిన వారు గ్రామాల నుంచి చికత్సల కోసం మండల కేంద్రాలకు రావడం ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వారికి ఇంటి వద్దే వైద్య సేవలు అందించే లక్ష్యంగా 104 సేవలను అమల్లోకి తెచ్చారు. దగ్గు, దమ్ము, ఆస్తమ, బీపీ, షుగర్‌, రక్తహీనత, ఫిట్స్‌ వంటి ఏడు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతు న్న వారికి చికిత్సలు అందించి అవసరమైన మందులను పంపిణీ చేస్తారు. గర్భిణులకు రక్త, మధుమేహ, ఇతరత్రా పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ఏమైనా సమస్యలుంటే ప్రభుత్వ ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తారు. ఐదేళ్లలోపు పిల్లలకు జ్వరం, జలుబు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు మందులు ఇస్తారు. సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తిలో రెండేసి చొప్పున హుజూర్ నగర్, నేరేడుచర్లలో ఒకటి చొప్పున కేటాయించారు. కోదాడ ప్రభుత్వాస్పత్రిలో వాహనాలు చెడిపోయి మరమ్మతులకు నోచుకోక ఆస్పత్రుల వద్దే నిరుపయోగంగా ఉన్నాయి. సదరు రోగులు అవసరమున్న మందులను ప్రైవేటు దుకాణా ల్లో కొనుగోలు చేస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో మూల కు చేరిన వాహనాల సిబ్బందిని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇతర చోట్ల డిప్యుటేషన్‌ కింద పంపించా రు. ఈ వాహనాలకు మందుల కోసం ప్రత్యే క బడ్జెట్‌ కేటాయించేవారు. కరోనా నేపథ్యంలో మందుల పంపిణీ కూడా నిలిచిపోయింది.

ఎన్‌సీడీ ద్వారా పరీక్షలు..

జిల్లాలో కొన్ని 104 వాహనాలు కండెమ్‌ స్థితిలో ఉన్నాయి. గతంలో మరమ్మతులు చేసి నడిపించాం. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్తాం. 104 వాహనాలు అందించే సేవలను ఎన్‌సీడీ (నాన్‌ కమ్యూనికేబుల్‌ డీసీజెస్‌) కార్య క్రమం ద్వారా గ్రామాల్లో చేపడుతున్నాం. బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇబ్బం దులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం.

– కర్పూరపు హర్షవర్ధన్, డీఎంహెచ్‌వో, సూర్యాపేట



Next Story

Most Viewed