4 రోజుల పాటు రిసార్ట్‌లో ప్రజాప్రతినిధులు.. కండీషన్ పెట్టిన టీఆర్ఎస్

by  |
4 రోజుల పాటు రిసార్ట్‌లో ప్రజాప్రతినిధులు.. కండీషన్ పెట్టిన టీఆర్ఎస్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లయిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను టీఆర్ఎస్ పార్టీ క్యాంపులకు తరలించింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో వీరంతా వెళ్లిపోయారు. హైదరాబాద్ శివార్లలోని ఓ రిసార్ట్‌లో వీరికి క్యాంప్ ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల పాటు అక్కడే ఈ క్యాంపు ఉండనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ క్యాంపులో సుమారు 850 మంది ప్రజా ప్రతినిధులు బయలు దేరి వెళ్లారు. మిగతా 146 మందిని రెండు మూడు రోజుల్లో తరలించేందుకు రంగం సిద్దం చేశారు.

నామినేషన్ విత్ డ్రా తరువాతే..

విత్ డ్రాయల్స్ తరువాత క్యాంపును వేరే ప్రాంతాలకు తరలించాలని అధిష్టానం భావిస్తోంది. ఒక వేళ పోటీలో ఉన్న వారంతా తప్పుకున్నట్టయితే క్యాంపును 26 సాయంత్రంతో క్లోజ్ చేసి తిరిగి వారి ఇళ్లకు పంపించనున్నారు. లేనట్టయితే యథావిధిగా పోలింగ్ జరిగే నాటి వరకు క్యాంపును కొనసాగించనున్నారు. అయితే క్యాంప్ లకు తరలి వెళ్లిన లీడర్లు క్యాంపులో చేరుకున్న తరువాత ఫోన్లు వినియోగించవద్దన్న కండీషన్ కూడా పెట్టినట్టు తెలుస్తోంది.

దంపతులు కంపల్సరీ..

అయితే ఈ సారి క్యాంపులో కొత్త విధానం అమలు చేయాలని నిర్ణయించారు. మహిళా ప్రజా ప్రతినిధులు వారి భర్తలను కూడా తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించారు. దంపతులు ఇద్దరు కూడా క్యాంప్‌లో ఉండే విధంగా చొరవ చూపాలని అధిష్టానం సూచించడంతో వారిని కూడా తీసుకెళ్తున్నారు.


Next Story

Most Viewed