కన్నుల పండుగ ఈ దేవి

by Muthe.Rajitha |

పదహారేళ్ల వయసు ‘మల్లి’ వేటగాడి ‘రోజా’ వజ్రాయుధం ‘సుభద్ర’

కన్నుల పండుగ ఈ దేవి
X

కన్నుల పండుగ ఈ దేవి

పదహారేళ్ల వయసు ‘మల్లి’

వేటగాడి ‘రోజా’

వజ్రాయుధం ‘సుభద్ర’

సినేమా నటీనటులలో

శ్రీదేవి ఉందా అంటే

ఆడియన్స్ మనసున

కురిసేవి విరిజల్లులే

తాను కాలు కదిపి ఆడిందా..

థియేటర్‌లో తెర మీదకు

నాణేల జల్లులు జల్లులే

బాక్సాఫీస్ వసూళ్లలో మహా మేటి

ఈ తారకెవరు సాటి?

తా(ను) పల్కె ‘నాకు నేనే పోటి’యని

చాలా సార్లిది రుజువాయె

‘అవును.. అవున’ని

సూపర్ స్టార్‌లకే తన జట్టు

అవసర పడింది

వారి సైదోడుగ తానుంటే, ఒట్టు

ప్రేక్షకులకు కన్నుల పండగైంది

నిర్మాతలకు కాసుల పంట పండింది

మరువతరమా

తనను మనము

అభినయ తేజస్సు

అక్షయ వర్చస్సు

ఆమె పుట్టిందే మన కోసం

200కు పైగా సినిమాలను

(కథానాయికగా) ఇచ్చిందోయ్ మన కోసం

తెలుగు తెరకు ‘దేవత’

తమిళ పడముక్కు ‘మీండుం కోకిల’

హిందీ ఫిల్మోంకీ ‘చాంద్ నీ’

ఈ ముజ్జగాల మహారాణి

ప్రేక్షక దేవ మనోహారిణి

(ఆగస్టు 13న శ్రీదేవి జయంతి)

-దిలీప్

80085 52647

(ఆగస్టు 13న శ్రీదేవి జయంతి)

Next Story