జ్ఞానం జ్యోతిలా వెలిగి..

by Ravi |   (  Updated:2023-03-19 18:30:31  IST  )

poet word

జ్ఞానం జ్యోతిలా వెలిగి..
X

సామాజిక స్పృహ ఉండాలి

సాదృశ్య భావన ఉండాలి

జ్ఞానకౌముది వెలగాలి

నవ్య కాంతులు విరజిమ్మాలి

మమతలకు అంకురార్పణ కలగాలి

సంధ్యా సమతలు విరబూయాలి

ప్రేమ పరిమళాలు వెదజల్లాలి

క్రాంతి వెలుగునివ్వాలి.

నా కలం నిత్యం రాయాలి.

దయ నిరంతరం విరబూయాలి

జాలి జయం జయమని మోగాలి.

కృప కృతనిశ్చయంగా వెలుగొందాలి.

స్పూర్తి సుప్రసన్నం కావాలి

అంతరంగంలో పదిమందికి

మానవుడే మాధవుడై చూయించాలి

జ్ఞానం ప్రమిదల జ్యోతిలా

నిరంతరం వెలుగునివ్వాలి.

శీలం, సుచరిత

భగవంతునిలో లీనం కావాలి.


సాయిమల్లు నడిగోటి

హెడ్ కానిస్టేబుల్, సుబేదారి.

97042 46115

Next Story