పల్లె విలువ

by Ravi |   (  Updated:2022-07-31 19:38:16  IST  )

పల్లె విలువ
X

పల్లెలు మనసున్న మల్లెలు

పల్లెలు ప్రేమలకు పొదరిల్లు

పల్లెలు బంధాలకు బొమ్మరిల్లు

పల్లెలు ఆప్యాయతలకు అంకురిల్లు

పల్లెలు అనురాగాలతో ప్రజ్వరిల్లు

పల్లెలు మనసున్న మల్లెలు

పల్లెలు కళలకు కళానిధులు

పల్లెలు ఆచారాలకు సన్నిధిలు

పల్లెలు సంస్కృతికి సారథులు

పల్లెలు సంప్రదాయాల వారథులు

పల్లెలు మనసున్న మల్లెలు

పల్లెలు పచ్చని చెట్లకు మార్గాలు

పల్లెలు పాడి పంటలకు స్వర్గాలు

పల్లెలు జల సవ్వడుల నిలయాలు

పల్లెలు ఇల సంపదల ఆలయాలు!

పల్లెలు మనసున్న మల్లెలు

పల్లెలే రైతన్నలకు పంచ ప్రాణాలు

పల్లెలే ఇంటింటి పచ్చటి గుమ్మాలు

పల్లెలే దేశానికి పట్టు కొమ్మలు

బోనగిరి. పాండురంగ

- తొర్రూరు

Next Story