- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
ఏ కొండైనా బోనమెత్తు
కొండంటేనే సిరులు, ఝరులు
తపము చేస్తున్న మునులు
తల మాణికమైన మనులు
భూ అగ్ర శ్రేష్టంబైన ఆ గిరులు
భావింప అభివ్యక్తంబగు
ఆ దైవానుగ్రహంబున భవ
భువి దివ్య బోనం కుండలు
చూస్తే చుట్టూరా కొండలు
ఊరేగుతున్న బోనం కుండలు
కొండలు గోల్ కొండలు
తీర్చి దిద్దిన బోనం కుండలు
గిరులు ప్రకృతి ప్రసాదములు
ప్రాణులకు సంజీవనములు
బోనాలు దైవానికి నైవేద్యములు
కొండలు - గోల్ కొండలు
బోనాలకు ప్రతిబింబాలు!
పంచభూతములు
ప్రతిక్షణం నిలబెట్టు నీ ప్రాణాలు
ప్రతిఫలంగా నీవు అర్పించు
గావు రంగాల బోనాలు
అమ్మవారి ఆశీర్వాదాలు
సర్వ జగతికి శాంతి సుఖాలు !
(బోనాల పండుగ సందర్భంగా)
పి. బక్కారెడ్డి
9705315250
- Tags
- poet word
Next Story






