నాన్న

by Ravi |   (  Updated:2026-07-06 00:15:57  IST  )

Poem

నాన్న
X

తాగుడుకు‌ మించి

అతడేమైనా కోరుకున్నాడా?

అతన్నెప్పుడైనా దేన్నయినా

ఆశయంగా పెట్టుకున్నాడా?

తన వయసు 18 కాదు, 16 అని

తన‌ మొదటి భార్యతో అబద్ధమాడి

రాయించుకున్నాడు

పెళ్లి పత్రం‌మీద

ఆమె చాలా వయసు కలది,‌

కోపిష్టి, జాతివివక్ష కల స్త్రీ

వారిద్దరికో కూతురు కూడా కలిగింది

నా సగం చెల్లెలు

చిన్న‌పిల్లగా ఉండగానే

తను వాళ్లను అనాథలుగా వదిలేసి

ఇంటినుండి వెళ్లిపోయాడు

మా అమ్మను పెళ్లి చేసుకున్నపుడు మాత్రం

అతడేమి‌ కోరుకుని‌ వుంటాడు?

అతనేమైనా ఆశయం కలిగివున్నాడా?

అస్తమానం తాగుతూ గడపడటం గాక.

అంతేనా అతను కోరుకున్నది?

మా ఇంటినుంచి అతడ్ని‌

మోసుకెళ్లినపుడు

నాకు పదమూడు సంవత్సరాలు

అతని‌ నీలి‌ముఖంలో‌

ఒక అభావమేదో తొణికిసలాడింది

కొంత ఆశ్చర్యంగానూ

అగమ్యగోచరంగానూ

కనిపించిందతని‌ ముఖం

మృత్యువనేది ఒక పజిల్లాంటిది

దాన్నెవరూ అంత త్వరగా

పరిష్కరించలేరు!

- ఆంగ్లం: ఛార్లీ‌ బ్రైస్

- తెలుగు: చిత్తలూరి

Next Story