- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
మనసు ఒక కల్లోల కడలి
ఎన్నో ఆలోచనల అలలు
లేచి పడుతున్నాయి
పడి లేస్తున్నాయి!
కష్టాలు కట్టకట్టుకొని వచ్చినట్లు
ఒకటి తర్వాత ఒక్కటి
ఎదుర్కొనే క్రమంలో
వెక్కి వెక్కి ఏడ్చిన రోజులు!
కారిన ఆ కన్నీటి ధారలకు
కట్టవేస్తే
సముద్రాలు కూడా
చిన్నవే అవుతాయి!
మనువాడిన వాడు
మనసెరుగక ప్రవర్తిస్తే
తనువును మాత్రమే ప్రేమిస్తే
విలపించని మనసు ఎక్కడ?
భర్తలో సగం భార్య
భార్యకు అంతా భర్తనే
అంతలా ప్రేమించినా
భర్తకు వింతపోకడలెందుకో?
కలతలు వస్తే
కాపురాలు కూలాలా
అలకలుగా భావించి
అర్థం చేసుకుంటే!
అధరపు మధురం చివరన
స్వర్గం మొదలవ్వదా!!
-జగ్గయ్య. జి
98495 25802
- Tags
- Poem
Next Story






