- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఎన్ని హోటళ్లు ఈ నగరంలో
ఉన్నా తాజ్ మహల్ ప్రశాంతంగా
అమ్మమ్మ ఇల్లులా ఉంటుంది
ఇది కొన్ని తరాల జ్ఞాపకాల వాకిళ్ళు
ఎందరో కబుర్లు చెప్పుకున్న బల్లలు ఇవి
ఎన్నో ఉద్వేగాల పొగలు
వేడి వేడిగా కమ్ముకున్న మహల్
అప్పటి వెయిటర్ కళ్ళల్లో
తాజాగా ఇప్పటికీ తిరుగుతారు
వారి రుచులు అభిరుచులు
ఎరిగిన వాడు కాలం టేబుల్‌పై
వాళ్లను క్లిన్ చేసింది
తుడిచేస్తే వెళ్ళేవి కావు అనుభూతులు
కలలు నీళ్ల గ్లాసు
జారిపోయినట్టు జారిపోతాయి
ఊహలు ఊరించి
చప్పున చల్లారిపోతాయి
ఇష్టంగా ఆర్డర్ చేసి
పక్కచూపులు చూస్తారు
ఒక సుందరి వచ్చిన క్షణాలు
అందరి చేతులను కట్టడి చేస్తుంది
జంటలు కూడా
జ్ఞాపకాలను సిప్ చేస్తుంటారు
వాళ్ళు ఖాళీ చేసిన
కుర్చీలలోకి ఇంకొరు వస్తారు
అంతా ఒక ఆట ఇది
చివరి కప్పు కాఫీ
ఏ రోజో ఎవరికి తెలియదు
-డా.సుంకర రమేశ్
94921 80764
- Tags
- Poem
Next Story






