ప్రాణం మిగలొచ్చు...

by Ravi |   (  Updated:2026-06-01 00:15:57  IST  )

Poem

ప్రాణం మిగలొచ్చు...
X

స్పీడుగా వచ్చే లారీకి ఎదురెళ్ళు,

పర్లేదు... ఏమీ కాకపోవచ్చు!

లీకవుతున్న గ్యాస్

సిలిండర్‌ను వెలిగించు,

బహుశా... అప్పుడూ

ప్రాణం మిగలొచ్చు!

సునామీ అలల్లోకి నడిచెళ్ళు,

ఏదో ఒక తీరం

సురక్షితంగానే చేర్చొచ్చు!

ప్రశ్నించు!

అంతే... నీకు వేరే దారి లేదు,

మృత్యుదేవత

నిన్ను వెంటాడుతుంది!

కావాలంటే ఈ విషయం...

అధికారులను నిలదీసే

గొంతులను అడుగు,

నిజాన్ని నిర్భయంగా రాసే

జర్నలిస్టులను అడుగు,

మృత్యుదేవత నీడ గురించి చెబుతారు!

-ప్రయా

76750 34380

Next Story