తెలంగాణం

by Ravi |   (  Updated:2026-05-31 22:46:13  IST  )

Poem

తెలంగాణం
X

నాలుగు కోట్ల గొంతుకల గర్జన

పల్లెల, పట్టణాల గుండె సప్పుడు

ఆకాశం ఎత్తు ఎగిసిన పోరు శిఖరం

సకల జనుల సమ్మె పోత పోసిన రూపం

జూన్ రెండున ప్రసవించిన పోరు బిడ్డ

నీళ్లు, నియామకాలకు నిర్మించుకున్న కోట

ఎండిన గొంతుల తడిపిన జీవధార

బీడు భూములకు ప్రాణం పోసి

పచ్చపచ్చగా దిద్దిన తెగువ

చెల్లా చెదురైన అక్షరాలను

అక్కున చేర్చుకొని ఆదరించిన త్యాగఫలం

నరనరాన నాదమై మోగి

జీవన వేదమైన తీర్పు

అసువులు బాసిన విద్యార్థుల

ఆయువు పోసుకొని నిలిచిన గానం

తెలంగాణం

-గుండెల్లి ఇస్తారి

98499 83874

Next Story