- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
నీ జ్వాలల జడివానలో
భూమి బుగ్గలు బీటలవుతున్నాయి
నీ నిప్పు చూపుల తాకిడికి
చెట్ల నీడలు చెమటలు కక్కుతున్నాయి
ఎండల ఎడారిలో గాలే
అగ్గిపుల్లలా రగులుతోంది
బావుల గుండెల్లో నీరు
జ్ఞాపకాల చుక్కగా మిగిలింది
పక్షుల పాటలు మసకబారి
గూళ్లలో నిశ్శబ్దం గూడు కట్టింది.
పొలాల పచ్చదనం
పసుపు పుటల పాత కథగా మారింది
కాలిబాటలపై కాలం
కాలి ముద్రల్ని కాల్చుకుంటూ నడుస్తోంది
మట్టి తల్లి ఒడిలో
దాహపు దుఃఖం చెలిమె తీస్తుంది
సూరయ్యా... జర్ర తగ్గు
నీ ప్రతాపం మాకు తెలుసు
ఒక్క మేఘాన్ని పంపు
ఒక్క చినుకును చల్లగా కురిపించు
నీ వేడి వీరత్వం కంటే
వాన నవ్వే ఈ నేలకు ప్రాణం
జీవం జారిపోక ముందే జర్ర తగ్గు!
-డా.కటుకోఝ్వల రమేష్
9949083327
- Tags
- Poem
Next Story






