నేనే వెలుగవుతాను

by Ravi |   (  Updated:2026-03-16 00:46:12  IST  )

Poem

నేనే వెలుగవుతాను
X

నా కనుల ముందు నా రూపం

ప్రత్యక్షమవగానే వెలిగిపోయే

కనురెప్పలకు ఇక ఏం చెప్పను...

అవి ఎవరి కోసం కాదు

నా కోసం చూసి చూసి

ధైర్యం నేర్చుకున్నాయి...

ఆ కనురెప్పలకు మాటొస్తే మాత్రం

అవి పలికే తొలిపదం

నా పేరే సఖీ…

కనుపాపలు కలవరిస్తున్నాయి

ఎవరినో చూడాలని కాదు

నా సామర్థ్యాన్ని నా శక్తిని

నా నిజమైన రూపాన్ని

కనులారా చూడాలని…

కలలో కాదు ఇక ఇలలోనే

నిజ జీవితంలోనే

నా స్వప్నాలను సాకారం చేసుకోవాలని…

ఆశలతోనే కాలాన్ని గడపాలని కాదు

ఆశయాలతోనే ప్రపంచాన్ని గెలవాలని…

ఇక నా కనులను

ఎవరికి కానుకగా ఇవ్వను

నా కలలకు నేనే బలంగా నిలబెడతాను

నా అడుగులకు నేనే వెలుగవుతాను…

- డా. హిప్నో పద్మాకమలాకర్

93900 44031

Next Story