చినుకు

by Ravi |   (  Updated:2026-03-16 00:30:39  IST  )

Poem

చినుకు
X

నీవే నా ప్రాణం నీవే నా ఊపిరి

నీవే నా శ్వాస నీవే నా ధ్యాస

నీవే నా సర్వస్వం అని జీవిస్తున్న నేను..

నేడు ఆ సర్వస్వం కోల్పోయి

నా హృదయ నాళాలలో ఘోరమైన

భారాన్ని మోస్తూ బరువెక్కిన

గుండెతో బాధపడాలా లేక...

ప్రాణం ఇంకా మిగిలే ఉంది అని

సంతోషించాలా అనే సందిగ్ధ స్థితి..

నా జీవితంలో ఏమీ లేని శూన్యమై

ఓడిపోయిన ఓ యోధుడిలా

నేను ఒంటరి ప్రయాణం చేస్తున్న

ఆ నిశీధిలో... ఉషోదయంలా

నా జీవితంలోకి ఓ దేవత వై

ధ్రువతారలా ఆ తలుకులతో

తొలకరి చినుకులా....

మరోసారి నీ పలకరింపుతో...

ఓ పులకరింతనై ఆ ఆనందానికి

అవధులు లేని ఆకాశాన్నయ్యాను.

-భార్గవ్ సైదులు,

99890 23822

Next Story