- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

పసుపు రంగు ఇనుప రాక్షసి
భూమిని కంపింపజేస్తూ..
గొంతు గుక్కతిప్పుకుంటూ
నెమ్మదిగా కదులుతూ వస్తుంది.!
ఎదురైనదాన్ని తోసేయడానికి
ఆత్రంగా వంగి ఉంటుంది.
చక్రాలు తిరిగే కొద్దీ ఇండ్ల గుండెల్లో
ఒక గుబులు తిరుగుతుంది.!
అది.. హైడ్రా పేరుతో నడిచిన హైడ్రామా బుల్డోజర్
HCU అడవిని చిదిమేసిన అంధకార బుల్డోజర్
వెలుగుమట్ల వెలుగునే ఆర్పిన అహంకార బుల్డోజర్.
ఇళ్లను, మనుషులను, ఆలోచనలను,
ఆనందాలను ఆవిరి చేసే దౌర్జన్య బుల్డోజర్!
చెట్టును కూలిస్తే చిగురు వస్తుంది,
కానీ నమ్మకాన్ని కూలిస్తే?
నేల రాలిన ప్రతి ఆకు రేపు ఒక ధిక్కారమై
గాలిలో తేలుతుంది!
ఇటుకలు పేర్చుకున్న కలలను
మట్టి కుప్పలుగా మార్చడం సులభమే..
కానీ ఆ మట్టిలో మొలిచే కన్నీటి విత్తనం
రేపు అధికార కోటల పునాదుల్ని తొలిచేస్తుంది!
చట్టం తన పని తాను చేసుకుపోతుందట
కానీ.. అది సామాన్యుడి గూడు ముందే
ఎందుకో ఆగిపోతుంది?
కంట బడిన ప్రతిచోట
కూల్చడమే పనిగా పెట్టుకుంటే..
ఒక రోజు.. కూల్చే చేతులకే
కూలే కాలం వస్తుంది..
చూసుకోరి!
-మామిడి అమరేందర్
77803 53511
- Tags
- Poem






