- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

నేను నేనే
నేను నేనై ఉంటాను.
నేను రాధను కాను
నా ప్రేమకథలో మరొకరి
భర్త ఉండటానికి.
రుక్మిణి కంటి నలుసు నేనెందుకౌతాను?
నా దృష్టిలో అలుసు నేనెందుకౌతాను?
నేను రాధను కాలేను..
నేను సీతను కాను
నా పవిత్రతకు ఋజువులు నేనివ్వజాలను
నిప్పులపై నేనడవజాలను..
ఆయనేంటి నన్ను వదిలేసేది?
నేనే తనను వదిలేస్తాను..
నేను మీరాని కూడా కాను
ఒక విగ్రహం మోజులో
నిగ్రహం కోల్పోవడానికి
ఇల్లు-వాకిలి వదిలి
సన్యాసులతో తిరగడానికి
ఏక్ తారా చేతబూని
బాధ్యతలు వదిలేయడానికి.
నేను మీరాను కాజాలను..
నేను ద్రౌపదిని కాను
జూదంలో ఓడించబడటానికి
వివస్త్ర గావించబడటానికి
ఆ కృష్ణుడిని నేనీరోజు
ఎక్కడినుండి తేను?
నేను ద్రౌపదిని కాజాలను.
నేను మనస్ఫూర్తిగా
ఇష్టపడినవాడితోనే జీవిస్తాను
ఆతడి అతిశయాన్ని సహించబోను.
నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను, కానీ..
త్యాగం పేరుతో యాతనను సహించబోను
ఎందుకంటే..... నేను నేనే
గుర్తుంచుకో... నేను నాలాగే ఉంటాను!
-సయ్యద్ ఖాసీం అలీ
9059022889
- Tags
- Poem






