- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఇదేనండి మన భాగ్యనగరం..
పోరుబాటల్లోన పొడిచిన తొలి పొద్దు పొడుపు
బతుకుదెరువు కోసం వచ్చిన
పేదల ఆశలకు రెక్కలు తొడిగావ్!
నిలువెల్లా గాయపడ్డ నిరుద్యోగులకు
విముక్తి గేయాలనిపించే ఆసరా నీవూ..
చార్‌మినార్ కొమ్మ మీద వాలిన విహంగానివై
ఎక్కడో కూ.. కూ అంటున్న కోయిలలా
నౌబత్ పహాడ్ గుర్తులవోలే
కొండ పై కూసేటి పక్షుల కిలకిల రావాలా
సబ్బండ వర్ణాల ఐక్యమత్యమే భాగ్యనగరం
నేటి తరం యువత
ఆశయాలకు ఊపిరి పోసి..
పల్లె పట్టణ వాసులను నిదురలేపిందీ
జీవిత పోరాటంలో చేయూతనిచ్చావ్
పడి లేచే కెరటాల వలే
కటిక చీకటి సాక్షిగా
కాలం నిద్రపోయిన వేళ
గుడ్లగూబల చప్పుళ్లు
నగరమంతా పరచుకుంటాయి
కానీ.. సాధించే లక్ష్యాన్ని
ఊపిరిగా మలుచుకొని
బాధ్యతల బరువు మోసే
వీరుడికి ప్రతి రాత్రి నిద్దుర లేని రాత్రే..!
-జక్కుల మమత
- Tags
- Poem
Next Story






