విగ్రహాలు..

by Ravi |   (  Updated:2026-03-02 01:00:40  IST  )

Poem

విగ్రహాలు..
X

'రాజుల పైసలు రాళ్లపాలు'

నిన్నటి మాట..

'జనాల పైసలు విగ్రహాల పాలు'

ఇప్పటి మాట

జాతి ఖ్యాతిని పెంచిన

మహాత్ముల స్ఫూర్తిని

చాటవలసిందే కానీ

సామాన్యుల స్థితిగతులు

విస్మరించి ఖజానా ఖాళీ చేయడం

ఏం సంస్కృతి..!?

జాతి జన హృదయాల్లో

మహనీయులు సుస్థిరం..

వారి సదాశయాలు మరిచి

విగ్రహారాధనలతో ఏం సాధిస్తాం..?

-శ్రీనివాస్ కాలె

90594 50418

Next Story