అమ్మ రాసిన "మరణశాసనం"

by Ravi |   (  Updated:2026-03-02 00:30:35  IST  )

Poem

అమ్మ రాసిన మరణశాసనం
X

మమతామయి తల్లి స్పర్శలోని ప్రేమ

అనిర్వచనీయం.

ఆమె ఒడి స్వర్గం కంటే మిన్న.

సమస్త సృష్టిలో మాతృప్రేమ అవ్యక్తం.

పిపీలికాది బ్రహ్మపర్యంతం,

జననికి తనకంటే బిడ్డల ప్రాణాలధికం.

శిశువు ఈ ప్రపంచాన్ని చూడకమునుపే

తన ప్రాణాలకన్నా అధికంగా ప్రేమించే అమ్మతనం,

సోషల్ మీడియా "ప్రేమ చేతిలో" మాతృత్వాన్ని కోల్పోయి

కన్న బిడ్డకు తానే మరణశాసనం రాసేస్తే,

"అమ్మ" పదానికి అర్ధమేముంది?

వెలుగు జిలుగులతో

మురిపించి మైమరపిస్తోన్న

ఆ మాయాలోకం ,

ఆనక వెతల తోరణాలతో

స్వాగతం పలుకుతుందని తెలియక

దాని మాయలోపడి ఎందరు

బలి అవుతున్నారో?

ఎన్ని జీవితాలు మాడి బూడిదవుతున్నాయో!

-వేమూరి శ్రీనివాస్

99121 28967

Next Story