టెడ్డీబేర్‌కు తెలుసు

by Ravi |   (  Updated:2026-03-02 00:45:38  IST  )

Poem

టెడ్డీబేర్‌కు తెలుసు
X

తన చేతుల్లో టెడ్డీబేర్‌ను

పొదిమి పట్టుకుంటుందా పిల్ల

తన ప్రార్థనకు ఒక జవాబు కావాలి

ఆ పిల్ల

టెడ్డీకి అన్నీ చెప్పుకుంటది

వింటుందని ఆశ

తన భయాల్నీ దుఃఖాల్నీ

టెడ్డీకి చెప్పుకుంటుంది

కానీ టెడ్డీ దేన్నీ మార్చలేదు కదా

కన్నీళ్లను తుడవలేదు

అసలు ఏమి వినలేదు

టెడ్డీని గట్టిగా పట్టుకుని

తన రహస్యాలన్నింటిని

అమాయకంగా చెప్పేస్తది.

టెడ్డీకి నోరు లేదు

రహస్యాలన్నీ

టెడ్డీతోనే ఉండిపోయాయి

టెడ్డీకి నోరే ఉంటే

"వాడు "ఎవరో

ఎక్కడెక్కడ తాకాడో

ఏమేమి చేశాడో ..

ఎవరికో ఒకరికి తెలిసిపోయేది

మూలం: జానెల్లి ఎరిన్ ఎలిజబెత్ పీటర్స్

"పోయెట్రీ.పిన్" నుండి

అనువాదం: ఉదయమిత్ర

89196 50545

Next Story