రాజకీయాకాశంలో...

by Ravi |   (  Updated:2026-02-23 01:16:00  IST  )

Poem

రాజకీయాకాశంలో...
X

సూర్యుడి పాలనలో

ఆకాశంలో

దినమూ,రాత్రీ

దాదాపుగా సమానాలు!

రాజకీయుల పాలనలో

రాజకీయాకాశంలో

సమానానికి శాశ్వత సమాధి;

వెలుగు దిన మొక్కశాతం కాగా

చీకటి బజార్ల రాత్రి తొంభైతొమ్మిది శాతం!

సంపదలను వాసనతో ఇట్టే పసిగడుతూ

సంచరించే దోపిడీదళాలు ఇక్కడ కోకొల్లలు;

నానాధనాలను చూపులతో మాయం చేస్తూ,

మిలమిల మెరిసే నక్షత్రమణుల

అమూల్య సంపదనూ కబళిస్తూ

కృష్ణబిలాల అగాధాల్లో దాచుకోవడమే...

అవినీతిదొంగలు నిరంతరం చేసే దోపిడీ పని!

-రఘువర్మ,

92900 93933.

Next Story