- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
పచ్చని చెట్లతో పరిసరాలు
ప్రసరిస్తున్న వెచ్చని సూర్యకిరణాలు
ప్రకృతిలోని అందమైన గమ్మత్తు
పారవశ్యంలో ఆనందపు మత్తు!
ఏ చిత్రకారుడు గీసిన చిత్రం
అందంగా పొందుపరిచిన విచిత్రం
అలిసిన మనసుకు ఉల్లాసం
ఉత్సాహానికి ఊతమిచ్చే ఆహ్లాదం!
సృష్టికారుడు నీకు
అడగకుండా ఇచ్చిన వరం
మరి ఎందులోనూ పొందలేము
పొందుపరుచుకో హృదయాన!
గెలుపు గుర్రాలపై స్వారీ చేసినా
విజయాల ఎవరెస్ట్ ఎక్కినా
ఉషస్సులు ఎన్ని చూసినా
తపస్సులు ఎన్ని చేసినా!
చివరకు నీవు కోరుకునేది
తనివితీరా తన్మయత్వం పొందడము
మనసారా రసాస్వాదన చెందడము
ఆనందాన్ని ఎదలో నింపుకోవడము!
ప్రకృతి ఒడిలో అమ్మతనం
భావిస్తే మనలో పసితనం!
అంతా విశ్వం నీకిచ్చిన కానుక!
తిరిగి నీవు ఏమిస్తావు మరువక!!
-జగ్గయ్య.జి
9849525802
- Tags
- Poem
Next Story






