సుద్దకార్యాలు

by Ravi |   (  Updated:2026-02-08 23:46:00  IST  )

Poem

సుద్దకార్యాలు
X

గద్దెల కొరకే గద్దలు

మిద్దెల కొరకే పయిసలు

మింగుట కొరకే సద్దులు

సుద్దులు చెప్పుట పెద్దల వలె

ఓటు కొరకు పెనుగుట కొరకే

ముద్దలు పుత్తడి ముద్దలు

పద్దులకెక్కనివి నలుపు పైసలు ఎన్నో

పెద్దల వలెమసిలెడి ఈ

ఎద్దిశ మదమెట్లు అణుగు ఎన్నికతోనే

-రేడియమ్

92915 27757

Next Story