- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
నిజంగా ఏది మంచిది?
ఓ ఆలోచనాత్మక స్థితిలో నేనడిగాను
‘పద్ధతి’ అంది న్యాయస్థానం
‘జ్ఞానం’ అంది పాఠశాల
ఒక వివేచనాశీలి ‘సత్యం’ అన్నాడు
ఓ అజ్ఞాని ‘సంతోషం’ అన్నాడు
‘ప్రేమ’ అన్నదో యువతి
‘సౌందర్యం’ అంది పుస్తకంలోని పేజీ
ఓ స్వాప్నికుడు ‘స్వేచ్ఛ’ అన్నాడు
ఓ ఋషి ‘ఇల్లు’ అన్నాడు
‘కీర్తి’ అన్నాడు ఓ సైనికుడు
‘సమానత్వం’ అని అన్నాడో ప్రవక్త
అపుడు నా విచారపూరితమైన
మనసు ఇలా అంది
‘ఇక్కడ సమాధానం లేదు’
అపుడు నా మనసు లోపలినుంచే
మృదువుగా ఇది విన్నాను
ప్రతి హృదయంలో ఒక రహస్యం ఉంటుంది
ఆ పదమే కరుణ!
Source: What Is Really Good?
By John Boylle O'Relly
(అనువాద కవిత )
-డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి
63027 38678
- Tags
- Poem
Next Story






