భూమి సీత సమాధి?

by Ravi |   (  Updated:2026-02-08 22:30:48  IST  )

Poem

భూమి సీత సమాధి?
X

దుఃఖం రామాయణం !!

సీత దుఃఖం సీతతోనే

భూమిలోకి పోయింది !

మొత్తం మీద దుఃఖాన్ని లెక్క వేస్తే

ఈ భూమి మొత్తం

సీత సమాధి అన్నట్లే!

అన్నింటిని భరించే భూమి

దుఃఖం పేరు మీదే

రిజిస్ట్రేషన్ అయిపోయింది!!

ఇక ఈ భూమి నాది

అని ఎవరైనా అనగలరా ??

- కందాళై రాఘవాచార్య

87905 93638

Next Story