అమ్మ రూపాలు

by Ravi |   (  Updated:2026-02-08 22:01:13  IST  )

Poem

అమ్మ రూపాలు
X

ఇంటి ఆడబిడ్డ నుదుట

పెట్టిన కుంకుమ బొట్టులా

పైన ఆకాశాన చందమామ!

ఆత్మీయతలు అందంగా అల్లుకున్నట్లు

ఆకాశాన రంగుల హరివిల్లు

పూసిన నవ్వుల్లా గగనాన చుక్కలు!

పోటీగా నేలపై అక్క వేసిన

చుక్కల ముగ్గులు

మురిసే మగువల మందహాసాలుగా!

నింగీ నేలల బంధం

అమ్మతనాన్ని పంచుకున్న

అక్కా తమ్ముళ్ళ అనుబంధంలా!

ఆకాశం నేలకు గొడుగులా

ఆకాశం అడుగున అరచేయిగా నేల

విడిపోని తోడూ నీడలుగా!

అప్పుడప్పుడు మబ్బులు కమ్ముకున్నా

భౌతిక దూరం ఎంతున్నా

అక్కా తమ్ముళ్లు అమ్మ రూపాలే కదా!

-జగ్గయ్య.జి

9849525802

Next Story