ప్చ్...!

by Ravi |   (  Updated:2026-01-25 23:30:20  IST  )

Poem

ప్చ్...!
X

మా ఊరిప్పుడు

చాలా ఇరుగ్గా మారింది

అచ్చం నా సమాధిలా

సమాధిలో నేను కాసేపు నిల్చుంటాను

ఆరడుగుల ఎత్తు పెరుగుతుంది

కొంచెం సర్దుకొని కూర్చుంటాను

మూడడుగులకు

కుదించుకొని పోతుంది

నడుము వాల్చి పడుకున్నపుడు

ఆరడుగుల వెడల్పవుద్ది

అంతకుమించి విశాలంగా

వుండాలని కోరుకోవడం

అత్యాశగానే భావిస్తున్నాను

నేనిప్పుడు

రెండో తరగతి పౌరుడ్ని...!

- సాబిర్

Next Story