- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

గణ తంత్ర రాజ్యంలో
మతతంత్ర ఆజ్యాలా
మన మనుగడపై
మనువాదుల వాజ్యాలా..
హక్కులు హరించి
సంప్రదాయ హద్దులతో
ఉక్కుపాదాల తాకిడి
ఆంక్షల సంకెళ్ల విన్యాసం
ప్రశ్నిస్తే సహించలేక కటకటాల సంకటం
ప్రజాస్వామ్య సూత్రాలకు తిలోదకాలారంభం
అవినీతి అక్రమాల చక్రబంధనంలో
బతికున్నవాడిప్పుడు చనిపోయిన ఓటరు
ప్రతికూల శక్తుల స్వైర విహారంలో
కుదేలయ్యే సామాన్య జీవన యానం.
ఇన్నేళ్ళ స్వేచ్ఛకు బిగిస్తున్న ఉచ్చులెన్నో
మూలాన నిర్మూలనకై కాషాయపు ఎచ్చులెన్నో
సహస్ర వృత్తుల మరణశయ్య
భిన్న సంస్కృతుల దీనఘోష
మనుగడే ప్రశ్నార్ధకమైతే
మౌనం సమాధానం కాదు
గణతంత్ర రాజ్యపు ఆశయాలు
పెకిలించే కుతంత్రాలు పెరుగుతున్న
ఈ పాలకవర్గ ప్రాభవాన్ని అడ్డుకోను
మరో పోరు అనివార్యం
సోచో జర జాగో యార్..జంగ్ కరనాహై
సబ్ లోగోం...కదం కదం మిలో
సమరం వినా వేరు మార్గంలేదు
ఎలుగెత్తి నినదించి..హెచ్చరించాలె..
-కపిల రాంకుమార్,
98495 35033
- Tags
- Poem






