ప్రశ్నకు వణుకుతున్న రాజ్యం

by Ravi |   (  Updated:2026-01-26 01:30:38  IST  )

Poem

ప్రశ్నకు వణుకుతున్న రాజ్యం
X

ఆటపాటల వయసులో

రాజ్యాంగపు పుటలను వల్లెవేస్తున్న

అక్షర విస్ఫోటనం వాడు!

ముక్కుపచ్చలారని ముఖమే కావచ్చు

కానీ, వ్యవస్థల పునాదులు కదిలేలా

నిజం మాట్లాడే ధైర్యం వాడి సొంతం!

అక్షరానికి కులం అంటగట్టినా

ప్రశ్నకు సంకెళ్లు వేయాలని చూసినా

అణగారిన గొంతుకల ప్రతిధ్వనిలా

అశ్వమిత్ వినిపిస్తూనే ఉంటాడు!

తుపాకీ గుండు కన్నా

చూపుడు వేలు చూపే

"చదువు" శక్తివంతమైనదని

చాటి చెబుతున్న

ఈ తరం ఏకలవ్యుడు వాడు!

భయపెట్టే కొద్దీ

మరింత బలంగా మొలిచే

ధిక్కారపు విత్తనం వాడు!

14 ఏళ్ల కుర్రాడు నిక్కచ్చిగా

నిజం మాట్లాడితే తనకు దక్కింది

అభినందనో, అవార్డో అనుకునేరు

అతడి మీద కేసులు, FIRలు మోపారు

అసలు రాజ్యానికి ప్రశ్నంటేనే భయం కదా..!

- మెర్సీ మార్గరెట్

90528 09952

Next Story