విశ్రాంత కోరిక

by Ravi |   (  Updated:2025-12-14 23:01:14  IST  )

Poem

విశ్రాంత కోరిక
X

విరక్తని బాధ పెట్టలేను

విసుగని బాధపడలేను

ఏదో అలవికాని ప్రశ్నను

మోయాల్సి వచ్చి

ఎటూ అడుగు వేయలేని

జవాబు కింద పడి

నలిగే కాలం అంచున

ఓ విశ్రాంత కోరిక

చేసే యుద్ధంలో

విరిగి ముక్కలైన

ఆలోచనాలెన్నో

బాహ్యంగా

మౌనాన్ని బిగించుకుని

ఓ ముగింపు తీర్పు కోసం

నీ మాట సమక్షంలోనే

నావి కొన్ని మాటలు

ఊపిరికి రాజీనామా చేసి

మనసు

పదవీ విరమణ చేసింది

-చందలూరి నారాయణరావు

97044 37247

Next Story