విజయం నిజముదే

by Ravi |   (  Updated:2025-12-14 23:45:22  IST  )

Poem

విజయం నిజముదే
X

తనలో ఎన్నెన్నో ప్రశ్నలు

ఎక్కడా తానే ప్రశ్నించాలా

తప్పును తప్పని చెప్పడం తప్పా

నాకెందుకని ఉండాలా?

అంతర్మధనం తనలో...

ఎదిరించడమా,

మౌనంగా భరించడమా?

మనసు చెప్పిందే వినాలని

వెనుకడుగు వేయొద్దని

తిరుగులేని తీర్మానం!

తను ఒంటరా....?

అంతా అబద్ధం వైపు ఉన్నపుడు!

మాటలు తూటాలవుతాయి

మాట్లాడేవారు మౌనం వహిస్తే!

మారని మనుషులపై

మనసు లేని వ్యక్తులపై

ఎప్పుడూ తిరుగుబాటు

ఎల్లప్పుడూ దిద్దుబాటు!

ఎన్నెన్నో అగ్ని పరీక్షలు

నిజం నిప్పు కదా!

తడబడక నిలబడితే

విజయం నిజముదే!

-జగ్గయ్య.జి

98495 25802

Next Story