- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

కాలిన బూడిద ప్రసాదమైంది
గాలికెగిరిన గోచి మానం నిలిపింది
ఊహకు తట్టని మాట రాతైంది
నోరు తెరిచిన కాడ గొడవైంది
ఒంటరి కాలమే పాలిస్తోంది
ధిక్కారమే శాసనమై నిలదీస్తోంది
ఏముందని అడగను
ఏమిస్తారని అర్రులు చాచను
కోరిక కుంపటై నెత్తిన కూర్చుంది
పిచ్చి ముదిరి ప్లెక్సీగా నిలబడింది
జెండా కర్రలన్నీ ఓ మూలకు చేరి
డాంభీకమే రాజ్యాన్ని ఏలుతోంది
కరిగిపోయే కొవ్వొత్తి కిందనే కాపురం
అరిగిపోయిన రికార్డుల ప్రగల్భాలు
ఏం చేస్తారని అడగను
ఏది కల్పిస్తారని మురిసిపోను
జాలి లేని తత్త్వమే బోధనైంది
స్ప్రహ లేని హామినే తోడై పడుంది
గాలి గోపురాల భ్రమలతోనే
జీవితం పరుగులు పెడుతోంది
కుర్చీల పందేరాల కలహాలతోనే
పొద్దు పొడవడం మొదులుపెట్టింది
ఎంతని అడగను
ఏమని అంగలార్చుకోను
చేతివాటమే చిందులు తొక్కుతోంది
అధికార బలగమే ఆయువైంది
మొక్కుబడి తీర్చడమే పనైపోయింది
తల నిలువునా ఊపడమే కాలమైంది
ఏం చేస్తారని అడగను
ఏం బతికిస్తారని మొరపెట్టుకోను
- నరెద్దుల రాజారెడ్డి
96660 16636
- Tags
- Poem






