కిటికీ తెరిస్తేనే...

by Ravi |   (  Updated:2025-12-08 00:45:42  IST  )

Poem

కిటికీ తెరిస్తేనే...
X

అవును

కిటికీ తెరిస్తేనే

వేడి సెగల దేహానికి

చలిగాలులు వింజామరలు వీచేది

వర్ణ శోభిత ప్రకృతి సోయగం

కళ్ళకు విందు చేసేది

కిటికీ కవతల ఏముందో తెలిసేది

కిటికీ తెరిస్తేనే కదా!

భిన్న భాషల కవుల

పరిచయ స్నేహ సౌరభాలు

అనువాద ఆదాన ప్రదానాల

విశాల జగత్తు

కిటికీ తెరిస్తేనే తెలిసేది!

దారుణ మారణ కాండలు,

ఘోర మానభంగ పర్వాలు,

అడుగడుగునా అమానవీయత

చూడగలిగేది

కిటికీ తెరిస్తేనే!

మనసు కిటికీ తెరిస్తేనే

మానవ జీవిత నదిని

ఆ నదికున్న అనేక

పాయలను దర్శించగలిగేది!

-డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి,

63027 38678

Next Story