నలుగురు ఏమనుకుంటారు?

by Ravi |   (  Updated:2025-10-13 00:00:52  IST  )

Poem

నలుగురు ఏమనుకుంటారు?
X

కంటికి కనిపించని

ఆ నలుగురి కోసమే,

నీ బతుకంతా చెక్కేస్తారు!

నిన్నో నిర్జీవ కణంగా

జీవశాస్త్రపు పరిభాషలో

పరిపరి విధాల ప్రతిపాదిస్తుంటారు!

నువ్వేడిస్తే,

లింగానిక్కూడా చిన్నచూపుని

చుట్టూరా పేర్చి దడి కడతారు!

నిద్ర లేచిన మొదలు

"నలుగురు ఏమనుకుంటారు?"

అన్న ప్రశ్న రోజూ

అన్ని దిశల్నుంచి గుచ్చుతుంటే,

ఆ నలుగురిని పట్టుకొని

నాలుగు తన్నాలనిపించేది!

డ్రెస్ సెన్స్ లేదన్నా ఓకే!

మాట తీరు సరిలేదన్నా డబుల్ ఓకే!

"ఆ నలుగురు ఏమనుకుంటారు?"

వాళ్లేం అనుకుంటే మనకేం?

మనం ఏం అనుకుంటామో

ఆ నలుగురికి తెలుసా?

-బాలాజీ పోతుల

81792 83830

Next Story