నాకిష్టం

by Ravi |   (  Updated:2025-09-28 23:46:06  IST  )

Poem

నాకిష్టం
X

మౌనం... నాకిష్టం

మౌనం.... నాకెంతో ఇష్టం

అది కాలం నేర్పిన పాఠం

ఆచరణ కొంచం కష్టం

అయినా.... నాకెందుకో ఇష్టం

మనసు విప్పి చెప్పినా

మూగ మాట అర్ధం కాకుంటే

మౌనం ఓ శబ్దం చేస్తుంది

మనిషoటే విలువ ఇవ్వని చోట

మౌనం... యుద్ధ ప్రేరిత ఆయుధం

గాయం చేసే మాటలు కన్నా

శ్రావ్యమైన మౌనం మిన్న

అందుకే... నా ఆశ్రమం... మౌనం

కానీ... మేధావి మౌనం

ప్రగతి విరోధం... వినాశనకరం

అవసరమైన చోట మౌనం.. నేరం

ముని అంటే మౌని అనే అర్ధం

మౌనం... జ్ఞానార్జన మార్గం

అందుకే... మౌనం నాకిష్టం

భమిడిపాటి గౌరిశంకర్

94928 58395

Next Story